: నారాయణఖేడ్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎం.భూపాల్ రెడ్డి


మెదక్ జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎం.భూపాల్ రెడ్డి పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆయన పేరును సీఎం కేసీఆర్ ప్రకటించారు. గతేడాది ఆగస్టులో కాంగ్రెస్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి అనారోగ్యంతో మరణించడంతో ఈ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. దాంతో 2014 ఎన్నికల్లో రన్నరప్ గా నిలిచిన భూపాల్ రెడ్డి పేరునే టీఆర్ఎస్ తిరిగి తమ అభ్యర్థిగా ప్రకటించింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కిష్టారెడ్డి కుమారుడు సంజీవ్ రెడ్డిని ప్రకటించగా, టీడీపీ-బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఎం.విజయ్ పాల్ రెడ్డిని తమ అభ్యర్థులుగా ప్రకటించే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News