: పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్న మహిళా ఎమ్మెల్యే భర్త మళ్లీ అరెస్టు


జేడీయూ మహిళ ఎమ్మెల్యే బీమా భారతి భర్త అవదేశ్ మండల్ ను పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు. ఓ హత్య కేసులో అవదేశ్ నిందితుడిగా ఉన్నాడు. నిన్న (మంగళవారం) మురంగ పోలీసులు అరెస్టు చేసిన కొద్దిసేపటికే ఎమ్మెల్యే భారతి, ఎంపీ సంతోష్ కుష్వాహాలు పార్టీ మద్దతుదారులతో కలసి స్టేషన్ కు వచ్చి ఆందోళన చేశారు. ఆ సమయంలో అవదేశ్ పోలీసుల కళ్లుగప్పి స్టేషన్ నుంచి తప్పించుకున్నారు. దానిపై తీవ్ర విమర్శలు రావడంతో సవాలుగా తీసుకున్న పోలీసులు ఇవాళ ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News