: జోరుమీదున్న ఆస్ట్రేలియా... భారీ షాట్లతో విరుచుకుపడుతున్న ఆసీస్!
కాన్ బెర్రాలో ఇండియాతో జరుగుతున్న నాలుగో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు స్కోరు దూకుడుగా ముందుకెళ్తోంది. భారత బౌలర్లను నిలదొక్కుకోనీయకుండా చేస్తూ, ఓపెనర్లు ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్ లు భారీ షాట్లతో అలరిస్తున్నారు. ఫించ్ 32 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 27 పరుగులు, వార్నర్ 40 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 44 పరుగులు చేశారు. దీంతో ఆస్ట్రేలియా స్కోరు 12 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 72 పరుగులకు చేరింది. ఇప్పటికే ఉమేష్ యాదవ్, భువనేశ్వర్ కుమార్ లు చెరో నాలుగు ఓవర్లు, ఇషాంత్ శర్మ 3 ఓవర్లు, గురుకీరత్ 1 ఓవర్ వేసినా వికెట్ తీయండంలో ఎవరూ సఫలం కాలేదు.