: ఐఎస్ఐఎస్ ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న 'ధర్మసేన'


దేశరాజధానికి బయట, ఉత్తరాఖండ్ సరిహద్దులో హిందూస్వాభిమాన్ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఐఎస్ఐఎస్ తో దీటుగా పోరాడేందుకు 'ధర్మసేన'ను సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. 2020 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం మరింతగా పెరిగిపోనుందనే వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో హిందూస్వాభిమాన్ ఇప్పటికే 15000 ధర్మసేన సైనికులను సిద్ధం చేసింది. వీరు దేశం కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధమని ప్రమాణం చేశారు. ఈ గ్రూపులో చిన్నారులు కూడా చేరడం విశేషం. వీరందరికీ కత్తి పట్టడం, బాణాలు ప్రయోగించడం తదితర అంశాలపై శిక్షణను అందిస్తున్నారు. ఈ శిబిరాల్లో పురుషులు, మహిళలు, పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరికీ శిక్షణనిస్తున్నారు.

  • Loading...

More Telugu News