: అపూర్వ కుటుంబం... అవయవదానానికి 80 మంది సభ్యుల సమ్మతి
80 మంది సభ్యులున్న ముంబైకి చెందిన ఒక క్రిస్టియన్ కుటుంబం సేవా దృక్ఫథానికి ఒక అపూర్వ ఉదాహరణగా నిలిచింది. కుటుంబంలోని మొత్తం 80 మంది సభ్యులు అవయవ దానానికి సమ్మతి తెలియజేస్తూ ప్రతిజ్ఞ చేశారు. దేశంలో అవయవ దానానికి ముందుకొచ్చిన అతి పెద్ద కుటుంబం ఇదే! దీనికి ముందు చత్తీస్ ఘడ్ కు చెందిన ఒక జైన కుటుంబంలోని 32 మంది సభ్యులు అవయవదానం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా తాజాగా అవయవ దానానికి ముందుకొచ్చిన కుటుంబంలో ఇంటిపెద్ద వయసు 82 సంవత్సరాలు. పిన్నవయస్కురాలికి 12 సంవత్సరాలు. ఈ కుటుంబ సభ్యులంతా దగ్గర దగ్గర ఇళ్లలోనే నివసిస్తుంటారు.