: మా మద్యం ఎంత తాగినా హ్యాంగోవర్ ఉండదు: ఉత్తర కొరియా
తమ శాస్త్రవేత్తలు తయారు చేసిన కొత్తరకం మద్యం ఎంత తాగినా హ్యాంగోవర్ సమస్య ఉండదని ఉత్తర కొరియా ప్రకటించింది. హ్యాంగోవర్ ఉండని మద్యాన్ని ప్రపంచంలో మొట్టమొదటిసారి తాము తయారు చేశామని ఉత్తర కొరియా శాస్త్రవేత్తలు వెల్లడించారు. చీనా దేశానికి చెందిన ఓ చెట్టు మూలిక దినుసుల నుంచి ఈ కొత్త రకం మద్యం తయారు చేసినట్టు వారు వివరించారు. కిరియో లిక్కర్ గా పిలిచే ఈ డ్రింకును ఉత్తర కొరియా ప్రభుత్వం నడుపుతున్న టాడాగాంగ్ ఫుడ్ స్టఫ్ ప్యాక్టరీలో తయారు చేయనున్నామని వారు పేర్కొన్నారు. ఈ మద్యం సాధారణ మద్యం కంటే మధురంగా ఉంటుందని, దీనిని తాగినవారు సౌమ్యంగా మారుతారని వారు చెప్పారు.