: డాక్టరేట్ అందుకుంటాడనుకుంటే...శవమయ్యాడు : రోహిత్ తల్లి ఆవేదన


కూలీ పనులు చేస్తూ తన కొడుకును చదివించానని.. ఉన్నత స్థానంలో చూస్తాననుకుంటే ఇలా శవమైపోయా డంటూ రోహిత్ తల్లి రాధిక వెక్కివెక్కి ఏడ్చారు. రోహిత్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ అధినేత జగన్ తో తన గోడును వెళ్ళబోసుకుంది. పేదరికం నుంచి బయటపడాలనే తాను రోహిత్ ను చదివించానని.. తన కొడుకు డాక్టరేట్ అందుకోవాలని ఎన్నో కలలు కన్నానని ఆమె రోదించారు. రోహిత్ ను సస్పెండ్ చేసినట్టు తమకు చెప్పలేదని, సస్పెండ్ చేశారని తెలిస్తే అతన్ని ఇంటికి తీసుకువెళ్లేవాళ్లమని అన్నారు. రోహిత్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అన్నారు. ఇక తన రెండో కొడుకును ఎంతమాత్రం చదివించనని.. ఈ చదువులు తమ కొద్దని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన రెండో కొడుక్కి ఏదైనా దారి చూపించాలని రాధిక వేడుకున్నారు. అనంతరం రోహిత్ సోదరుడు మాట్లాడుతూ, తమ తల్లి కడుపు మాడ్చుకుని మరీ తమని పోషించిందని జగన్ కు చెప్పారు.

  • Loading...

More Telugu News