: మగాడినైతే అలా విమర్శించేవారా?...ఆడదాన్ననే ఇలా అంటున్నారు!: వాపోయిన మడోన్నా


'మహిళను కాబట్టే నన్ను ఇలా విమర్శిస్తున్నారు. అదే గాయకుడై ఉంటే ఇలా విమర్శించేవారా?' అంటూ ప్రముఖ పాప్ సింగర్ మడోన్నా వాపోయింది. అమెరికాలోని కెంటకీలో స్టేజ్ షో ఇచ్చిన సందర్భంగా మడోన్నా స్టేజ్ పై తూలింది. దీనిపై సోషల్ మీడియాలో పెను దుమారం రేగింది. స్టేజ్ షోకి మడోన్నా తాగి వచ్చిందని కొందరంటే, లేదు పాట లిరిక్స్ మర్చిపోయి తాగినట్టు నటించిందని మరి కొందరు విమర్శించారు. దీనిపై ఇన్ స్టాగ్రాం ద్వారా స్పందించిన మడోన్నా, తానెప్పుడూ మద్యం తాగి స్టేజ్ షో చేయనని తెలిపింది. తాను 2 గంటల 15 నిమిషాలు నాన్ స్టాప్ గా పాటలు పాడుతూ డాన్స్ చేయగలనని ఆమె అభిమానులకు గుర్తు చేసింది.

  • Loading...

More Telugu News