: ఖాళీగా వుంటే స్నేహితులతోనే ఉంటా!: రెబల్ స్టార్ కృష్ణంరాజు
తనకు స్నేహితులతో గడపడం ఇష్టమని టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఖాళీగా వున్నప్పుడు స్నేహితులను కలుసుకునేందుకు తాను ఇష్టపడతానని అన్నారు. తనకు ఎక్కువ మంది స్నేహితులు ఉన్నారని ఆయన తెలిపారు. వారితో సంతోషంగా గడపడం తనకు ఇష్టమని ఆయన అన్నారు. తన సినిమాల్లో 'బొబ్బిలి బ్రహ్మన్న' సినిమా బాగా ఇష్టమని చెప్పిన ఆయన, తానేనా ఇలా నటించింది? అని ఇప్పటికీ ఫీలయ్యే సినిమా చేశానని చెప్పారు. తనకు డెడికేషన్ ఎక్కువని, ఇంటి నుంచి బయటికెళ్తే చేసే క్యారెక్టర్ తప్ప మరేదీ గుర్తుండేది కాదని కృష్ణంరాజు చెప్పారు. అలాగే ఇంటికి వస్తే ఇతర విషయాలు పట్టించుకోనని అన్నారు. ఇష్టమైన సినిమాలు నిర్మించేందుకే బ్యానర్ స్టార్ట్ చేశానని ఆయన చెప్పారు.