: డొనాల్డ్ ట్రంప్ ఓ బఫూన్, పిచ్చోడు!: బ్రిటన్ ఎంపీలు


అమెరికా అధ్యక్ష స్థానానికి పోటీ పడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై బ్రిటన్ ఎంపీలు విరుచుకుపడ్డారు. డొనాల్డ్ ట్రంప్ ను బఫూన్ అంటూ వ్యాఖ్యానించిన ఐర్లాండ్ ఎంపీలు, అతనో పిచ్చివాడని పేర్కొన్నారు. ముస్లింలను దేశంలో అడుగుపెట్టనీయకుండా చేయాలని ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా, బ్రిటన్ లో ట్రంప్ ప్రవేశాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ సందర్భంగా స్కాట్లాండ్ కు చెందిన ఎంపీలు ట్రంప్ ను నిషేధించాల్సిందేనని గట్టిగా వాదించారు. ఈ సందర్భంగా ట్రంప్ ను బఫూన్, పిచ్చోడిగా అభివర్ణించారు. అయితే, ఆయనపై పెట్టిన తీర్మానం వీగిపోయింది. కాగా, ఆయనపై నిషేధం విధించాలని ఆయన ఎక్కువగా పెట్టుబడులు పెట్టిన స్కాట్లాండ్ ప్రాంత ఎంపీలే బలంగా డిమాండ్ చేయడం విశేషం.

  • Loading...

More Telugu News