: ట్విట్టర్ సేవలకు మళ్లీ అంతరాయం!


సాంకేతిక కారణాల వల్ల ఈ రోజు కూడా ట్విట్టర్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో చాలా మంది వినియోగదారులు తమ ట్విట్టర్ ఖాతాలను తెరవలేకపోయారు. దీంతో ట్విట్టర్ లో సాంకేతిక సమస్య వచ్చిందని.. దానిని సరిచేసే ప్రయత్నంలో ఉన్నామనే సందేశాన్ని ఉంచారు. కాగా, నిన్న కూడా సుమారు 10 నిమిషాల పాటు ట్విట్టర్ సేవలకు అంతరాయం కల్గింది. ఆ తర్వాత కొద్ది నిమిషాలకు సాంకేతిక సమస్యను పరిష్కరించడం జరిగింది. ఈ మధ్య కాలంలో ట్విట్టర్ సేవల్లో తరచుగా అంతరాయం కల్గుతుండటంతో వినియోగదారులు కొంత అసహనానికి గురవుతున్నారు.

  • Loading...

More Telugu News