: నరేంద్ర మోదీ, పారికర్ లను హత్యచేస్తామని ఉగ్రవాదుల లేఖ!
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద ముద్రతో కూడిన ఓ లేఖ గోవా సచివాలయానికి రాగా, భారత ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ శాఖా మంత్రి మనోహర్ పారికర్ లను హత్య చేస్తామన్న హెచ్చరికలు అందులో రాసుండటం కలకలం రేపింది. దీని ప్రతిని గోవాలోని అన్ని పోలీసు స్టేషన్లకూ పంపిన ప్రభుత్వం, ఏటీఎస్ (ఉగ్రవాద నిరోధక దళం) బృందానికి విచారణను అప్పగించారు. ఈ లేఖపై చర్యలు తీసుకుంటున్నామని, మిగతా ఏజన్సీలతో కలిసి విచారణ జరుగుతోందని తెలిపారు. కాగా, ఈ లేఖలో గోవధను నిషేధించడంపై ఉగ్రవాదులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ లేఖ ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయం కనుగొంటామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.