: మేడారం జాతరకు టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
వరంగల్ జిల్లాలో వచ్చే నెలలో జరగనున్న మేడారం జాతరకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు ప్రకటించింది. ఫిబ్రవరి 13 నుంచి 21 వరకు హైదరాబాద్ నుంచి ప్రతిరోజు 50 చొప్పున ప్రత్యేక బస్సులు నడుపుతామని తెలిపింది. ఈ ప్రత్యేక బస్సులకు ముందస్తు రిజర్వేషన్లు చేసుకునే సదుపాయం ఉందని ఆర్టీసీ పేర్కొంది. అందుకోసం TSRTCONLINE.IN వెబ్ సైట్ ద్వారా రిజర్వేషన్ చేసుకోవచ్చని వెల్లడించింది. మరోవైపు రద్దీకి అనుగుణంగా ఎంజీబీఎస్, ఉప్పల్ నుంచి గంటకో బస్సు నడపనున్నామని ఆర్టీసీ అధికారులు వివరించారు. ప్రత్యేక బస్సులో 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేస్తామని స్పష్టం చేశారు.