: అసోంలో అప్పుడే మొదలైన బీజేపీ ఎన్నికల ప్రచారం!


అసోం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలే ఇంకా వెలువడలేదు, అప్పుడే బీజేపీ ప్రచారం ప్రారంభమై పోయింది. ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఉదయం అసోంలోని కోక్రాజార్ లో భారీ సంఖ్యలో హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రం అభివృద్ధికి తాము సహకరిస్తామని చెబుతూ, ఎన్నికల్లో బీజేపీని ఎన్నుకోవాలని ఎన్నికల ప్రసంగం చేశారు. "మీతో కలిసి భుజం కలిపి పని చేసేందుకే నేను ఇక్కడికి వచ్చాను. మనస్ఫూర్తిగా చేబుతున్నా, నా చేతులు చాచివున్నాయి. అందుకోండి. గత 15 ఏళ్లుగా వారు (కాంగ్రెస్ పార్టీ) హామీలు ఇస్తూనే ఉన్నారు. ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. అదే మీకు ఆగ్రహాన్ని కలిగిస్తోందని నాకు తెలుసు" అని మోదీ వ్యాఖ్యానించారు. అసోం నుంచి ఎన్నికైన వ్యక్తి ప్రధానిగా ఉండి కూడా (మన్మోహన్ సింగ్) ఎన్నో డిమాండ్లు పెండింగ్ లోనే ఉన్నాయని తెలుసుకుని తాను ఆశ్చర్యపోయినట్టు వివరించారు. గతంలో రాజీవ్ గాంధీ చెప్పినట్టు ఢిల్లీలో ఇస్తున్న ఒక్క రూపాయి గ్రామాలకు చేరేసరికి 15 పైసలుగా మారిపోతోందని, గత పదేళ్లుగా అదే జరిగిందని, బీజేపీ అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారిందని అన్నారు. అభివృద్ధితోనే అన్ని సమస్యలూ తీరుతాయని మోదీ అసోం ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News