: తమిళనాడులో 'అమ్మ' పథకం మరొకటి


తమిళనాడు రాష్ట్రంలో ఈరోజు 'అమ్మ' పథకం మరొకటి ప్రారంభమైంది. సీఎం జయలలిత స్వయంగా 'అమ్మ కాల్ సెంటర్ల'ను ప్రారంభించారు. ప్రజల సమస్యలకు పరిష్కారం కోసం వీలుగా ఉండేందుకుగాను ఈ కాల్ సెంటర్ ను తీసుకొచ్చినట్టు ప్రభుత్వం వెల్లడించింది. కాబట్టి ప్రజలంతా కాల్ సెంటర్ కు ఫోన్ చేసి సమస్యలను విన్నవించుకోవాలని పేర్కొంది. ఈ కాల్ సెంటర్లకు 1100 టోల్ ఫ్రీ నంబర్ కేటాయించారు. ఇవి 24 గంటలు, 365 రోజులు పనిచేస్తాయని అధికారులు చెప్పారు. ఇప్పటికే తమిళనాడులో అమ్మ పేరుతో పలు పథకాలు ఉన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News