: పశ్చిమ గోదావరి జిల్లాలో కేసీఆర్ ప్లెక్సీ... మీరూ చూడండి!
తెలంగాణలో కేసీఆర్ పాలనా విధానాలు నచ్చాయో లేక, ఆయనపై అమిత అభిమానముందోగానీ, ఓ విద్యావేత్త పాలకొల్లులో ఆయన ప్లెక్సీలను ప్రచురించడం చర్చనీయాంశమైంది. ఐసీఆర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, పాలకొల్లు వాసి వల్లభు శ్రీనివాసరావు ఈ ప్లెక్సీ ఏర్పాటు చేశారు. తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ దీన్ని ఏర్పాటు చేయగా, పలువురు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఈ ప్లెక్సీల వద్ద యువత సెల్ఫీలు దిగుతూ ఆనందిస్తోందని శ్రీనివాసరావు వెల్లడించారు. పాలకొల్లులో ఏర్పాటైన ఆ ప్లెక్సీ ఇదే.