: క్రిస్టియన్ సంప్రదాయంలో రాహుల్ శర్మ, అసిన్ వివాహం
కథానాయిక అసిన్, వ్యాపారవేత్త రాహుల్ శర్మలు వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఇవాళ ఉదయం ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో ఇద్దరికీ క్రిస్టియన్ సంప్రదాయంలో పెళ్లి జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు తదితరులతో కలిపి 50 మంది మాత్రమే ఈ వివాహానికి హాజరైనట్టు తెలిసింది. కాగా ఇవాళ సాయంత్రం హిందూ సంప్రదాయంలో మరోసారి వారిద్దరూ పెళ్లి చేసుకోనున్నారు. ఈ పెళ్లికి 200 మంది అతిథులు హాజరయ్యే అవకాశం ఉంది. ఇక ఈ నెల 23న ముంబైలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.