: హెచ్ సీయూలో రాహుల్... హోరెత్తుతున్న విద్యార్థుల నినాదాలు


రీసెర్చి స్కాలర్ రోహిత్ ఆత్మహత్యతో రణరంగంగా మారిన హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అడుగుపెట్టారు. రోహిత్ ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులపై ఆరా తీయడమే కాక బాధిత విద్యార్థికి నివాళులర్పించేందుకు హైదరాబాదు వచ్చిన రాహుల్ గాంధీకి బేగంపేట ఎయిర్ పోర్టు వద్ద నిరసన జ్వాలలు ఎదురయ్యాయి. అయితే వర్సిటీలో మాత్రం రోహిత్ వర్గానికి చెందిన విద్యార్థుల నుంచి రాహుల్ గాంధీకి నినాదాల హోరుతో స్వాగతం లభించింది. రాహుల్ గాంధీని చూసిన ఉత్సాహంలో రోహిత్ తరఫు విద్యార్థులు నినాదాలతో హోరెత్తిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ ఘటనపై విచారణ జరుపుతున్న కమిటీతో మాట్లాడటమే కాక విద్యార్థులతోనూ ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News