: ఈ కమిటీ స్థాయి చాలదు.. అత్యున్నత స్థాయి కమిటీని వేయాలన్న చేవెళ్ల ఎంపీ


హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ రీసెర్చి స్కాలర్ రోహిత్ ఆత్మహత్యపై వేగంగా స్పందిస్తున్న రాజకీయ పార్టీలు ఒకదానిపై మరొకటి విమర్శలు, ప్రతివిమర్శలు సంధించుకుంటున్నాయి. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు కేంద్రం ఇద్దరు సభ్యులతో కూడిన కమిటీని హైదరాబాదుకు పంపింది. నేటి ఉదయం సదరు కమిటీ సభ్యులు హెచ్ సీయూలో విచారణ కూడా ప్రారంభించారు. ఈ విచారణకు పిలవకుండానే టీఆర్ఎస్ నేత, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి హాజరయ్యారు. రోహిత్ ఆత్మహత్యపై విచారణ చేసేందుకు ద్విసభ్య కమిటీ స్థాయి సరిపోదని ఆయన కమిటీ సభ్యులకే నేరుగా తేల్చిచెప్పారు. ఈ ఘటనలో వాస్తవాలు వెలుగుచూడాలంటే మరింత అత్యున్నత స్థాయి కమిటీ చేత విచారణ జరిపించాలని ఆయన కమిటీని కోరారు.

  • Loading...

More Telugu News