: ప్రత్యేక విమానంలో బేగంపేట చేరుకున్న రాహుల్... మరికాసేపట్లో హెచ్ సీయూకు
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కొద్దిసేపటి క్రితం హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో రీసెర్చి స్కాలర్ రోహిత్ ఆత్మహత్య రాజకీయ రంగు పులుముకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై వర్సిటీకి లేఖ రాసిన కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను తక్షణమే కేంద్ర కేబినెట్ నుంచి సస్పెండ్ చేయాలని విపక్షాలన్నీ డిమాండ్ చేశాయి. మరో అడుగు ముందుకేసిన రాహుల్ నేడు హెచ్ సీయూను సందర్శించాలని నిర్ణయించుకున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరిన ఆయన కొద్దిసేపటి క్రితం బేగంపేటలో ఎయిర్ పోర్టులో ల్యాండయ్యారు. అక్కడి నుంచి ఆయన నేరుగా హెచ్ సీయూ వెళ్లనున్నారు. అక్కడ ఇప్పటికే రోహిత్ ఆత్మహత్యపై విచారణ జరుపుతున్న కేంద్ర ద్విసభ్య కమిటీతో పాటు విద్యార్థులతోనూ రాహుల్ వేర్వేరుగా భేటీ అవుతారు.