: పెను సంచలనం... ఆస్ట్రేలియన్ ఓపెన్ తొలి రౌండ్ లోనే వీనస్ విలియమ్స్ ఓటమి, కష్టపడుతున్న రఫెల్ నాదల్


ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ పోటీల రెండో రోజు పెను సంచలనం నమోదైంది. అమెరికా టెన్నిస్ క్రీడాకారిణి వీనస్ విలియమ్స్ తొలి రౌండ్ లోనే ఓడిపోయింది. ఈ ఉదయం జరిగిన మహిళల సింగిల్స్ పోటీలో పదో ర్యాంకర్ గా బరిలోకి దిగిన వీనస్ కు తనకన్నా 37 ర్యాంకుల దిగువన ఉన్న బ్రిటన్ క్రీడాకారిణి జొహన్నా షాకిచ్చింది. రెండు వరుస సెట్లలో (6-4, 6-2 తేడాతో) ఓడించింది. కాగా, ప్రస్తుతం జరుగుతున్న పోరులో 5వ సీడ్ గా బరిలోకి దిగిన రఫెల్ నాదల్ విజయం కోసం శ్రమిస్తున్నాడు. నాదల్, వెర్దాస్కో మధ్య తొలి రౌండ్ పోరు జరుగుతుండగా, తొలి సెట్ ను 7-6 తేడాతో వెర్దాస్కో గెలుచుకున్నాడు. రెండు, మూడు సెట్లను 6-4, 6-3 తో గెలుచుకున్న నాదల్ నాలుగో సెట్లో తొలి గేమ్ లో సర్వీసును నిలబెట్టుకోలేక 1-0తో వెనుకబడ్డాడు.

  • Loading...

More Telugu News