: మసూద్ దోషే!... 70 పేజీల నివేదిక సిద్ధం: పాక్ కు అందజేయనున్న భారత్


పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన ఉగ్రవాద దాడిలో జైషే మొహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ దోషేనని భారత్ వాదిస్తోంది. అంతేకాక కరుడుగట్టిన సదరు ఉగ్రవాదిని తమకు అప్పగించాలని కూడా పాకిస్థాన్ ను కోరనుంది. ఈ మేరకు మసూద్ కార్యకలాపాలకు సంబంధించి 70 పేజీల సుదీర్ఘ నివేదికను భారత్ సిద్ధం చేసింది. త్వరలోనే ఈ నివేదికను పాక్ కు అందజేసేందుకు సన్నాహాలు చేస్తోంది. సుదీర్ఘంగా రూపొందిన సదరు నివేదికలో పఠాన్ కోట్ దాడిలో మసూద్ పోషించిన పాత్ర, అతడి ఉగ్రవాద సంస్థ జైషే మొహ్మద్ కార్యకలాపాలు, శిక్షణా శిబిరాలు, నిధుల సమీకరణ తదితరాలకు సంబంధించి సమగ్ర వివరాలు, సాక్ష్యాలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇక మసూద్ తో పాటు మరో 20 మంది కరుడుగట్టిన జైషే ఉగ్రవాదుల పేర్లను కూడా ఆ నివేదికలో భారత్ ప్రస్తావించింది.

  • Loading...

More Telugu News