: ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపునకు ప్రతిపాదనలు!
ఏపీలో 2016-17లో విద్యుత్ ఛార్జీల పెంపునకు డిస్కంలు ఈఆర్సీకి ప్రతిపాదనలు సమర్పించాయి. రూ.783 కోట్లతో విద్యుత్ ఛార్జీల పెంపునకు ఈరోజు సాయంత్రం ప్రతిపాదించాయి. 200 యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగించే వారికి నాలుగు శాతం మేర పెంచాలని, 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడే వారికి చార్జీల పెంపు వర్తించదని ఆ ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. కాగా, ఈ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకున్న ఈఆర్సీ బహిరంగ విచారణ అనంతరం ఈ విషయమై నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపింది.