: ముస్లిమేతరులను ఏం చేసే హక్కయినా ముస్లింలకు ఉంది: మహిళా ప్రొఫెసర్ వితండవాదం!
ముస్లిమేతర యువతులపై అత్యాచారం చేసే హక్కును అల్లా ముస్లింలకు ఇచ్చాడని ఓ మహిళా ఇస్లామిక్ ప్రొఫెసర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈజిప్టులోని కైరోకు చెందిన అల్-అజర్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ సువాద్ సలే ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. 'ఇన్ క్విస్టిర్' వార్తా సంస్థకు ఇచ్చిన ఈ ఇంటర్వ్యూ ఇప్పుడే 'లైవ్ లీక్'లో పోస్ట్ కాగా, వైరల్ అవుతోంది. ముస్లిం పురుషులు ఇతర మతానికి చెందిన మహిళలను లైంగిక బానిసలుగా చూసుకోవచ్చని, అది అల్లా దృష్టిలో చట్ట సమ్మతమేనని అన్నారు. అయితే, అది ఒకసారికి మాత్రమే పరిమితమని, ఇజ్రాయిల్ వంటి శత్రువులపై చేసే యుద్ధంలో భాగంగా వారి మహిళలను ఏమైనా చేయవచ్చని అన్నారు. కాగా, ఆ ప్రొఫెసర్ వ్యాఖ్యల ప్రకారం, ఈజిప్టు ముస్లింలు ఇజ్రాయిల్ మహిళలను లైంగిక బానిసలుగా వాడుకోవచ్చని, అత్యాచారాలు చేయవచ్చని ఇన్ క్విస్టర్ న్యూస్ రిపోర్ట్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఆమె మాట్లాడిన వీడియో ఇప్పుడు ఆన్ లైన్లో అందుబాటులో ఉంది. ఆమె వ్యాఖ్యలపై ఇప్పుడు దుమారం చెలరేగుతుండగా, దీనిని పలువురు ముస్లిం జాతీయులు కూడా ఖండిస్తున్నారు. ఇస్లాంపై ఇది తప్పుడు ప్రచారమని దుయ్యబడుతున్నారు.