: కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, హెచ్ సీయూ వీసీలపై కేసు నమోదు
హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ రోహిత్ (28) ఆత్మహత్య ఘటనలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, హెచ్ సీయూ వైస్ ఛాన్సలర్ అప్పారావులపై కేసు నమోదైంది. కొంత మందికి మద్దతుగా కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఇచ్చిన లేఖ వల్లే రోహిత్ మృతి చెందాడని ఆరోపిస్తూ, విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ లేఖ వల్లే వీసీ అప్పారావు, ఐదుగురు విద్యార్థులపై సస్పెన్షన్ వేటు వేశారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఈ కేసులో ప్రధాన నిందితులైన ఏ1 వీసీ అప్పారావు, ఏ2 దత్తాత్రేయ, ఏ3 సుశీల్ కుమార్, ఏ4 విష్ణుపై సెక్షన్ 306పై కేసు నమోదు చేశారు.