: నిన్న కేసు, నేడు అదుపులోకి... నరసరావుపేట ఎమ్మెల్యే అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ లో వైకాపా నేతల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ప్రభుత్వ అధికారుల విధులకు భంగం కలిగించేలా ప్రవర్తించారన్న ఆరోపణలపై నిన్న నరసరావుపేట వైకాపా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై కేసు పెట్టిన పోలీసులు, ఈ ఉదయం ఆయన్ను అరెస్ట్ చేశారు. గోపిరెడ్డి ఇంటికి వెళ్లి అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించిన పోలీసులు, ఆయన్ను స్టేషనుకు తరలించగా, వైకాపా శ్రేణులు నిరసనగా ఆందోళన చేపట్టడంతో, పేటలో ఉద్రిక్తత నెలకొంది. కాగా, రొంపిచర్ల మండల పరిధిలో అసైన్డ్ భూముల్లో వేస్తున్న రహదార్లను గోపిరెడ్డి అడ్డుకోగా, ఎమ్మార్వో ఫిర్యాదు మేరకు కేసు నమోదైన సంగతి తెలిసిందే.