: మా నాన్నది ఆత్మహత్య కాదు... గుండెపోటు: మాజీ జడ్జి ప్రభాకర్ రావు కుమారుడు


తన తండ్రి ఆత్మహత్య చేసుకోలేదని, ఆయనది అనుమానాస్పద మృతి కాదని మాజీ జడ్జి ప్రభాకర్ రావు కుమారుడు డేవిడ్ ప్రశాంత్ వ్యాఖ్యానించారు. కొద్దిసేపటి క్రితం మీడియా ముందుకు వచ్చిన ఆయన, తీవ్రమైన గుండెపోటుతో తన తండ్రి మరణించారని, ఆసుపత్రికి తీసుకువెళ్లే సమయం కూడా తమకు లేకపోయిందని తెలిపారు. తన తండ్రి మరణాన్ని రాజకీయం చేయవద్దని కోరారు. పోలీసుల విచారణకు సహకరిస్తామని అన్నారు. కొంతకాలంగా ఆయన వికలమైన మనస్సుతో మనస్తాపంగా ఉంటున్నారని డేవిడ్ ప్రశాంత్ తెలిపారు. మరికాసేపట్లో ప్రభాకర్ రావు మృతదేహానికి గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం జరుగనుంది.

  • Loading...

More Telugu News