: 3 కోట్ల విలువైన నగలతో అర్ధ కుంభమేళాకు 'గోల్డెన్ బాబా' హాజరు


బంగారమంటే ఎవరికి మోజు ఉండదు... ఈ కలికాలంలో సన్యాసులకూ మినహాయింపు లేదని నిరూపిస్తున్నాడు హరిద్వార్ లో జరుగుతున్న అర్ధ కుంభమేళాకు హాజరైన ఒక సాధువు. కుంభమేళాకు సామాన్యులతోపాటు ఎక్కడెక్కడి నుండో సాధు సన్యాసులు, నాగా సాధువులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో తన శిష్యగణంతో పాటు వచ్చిన ఒక సాధువు అనేక బంగారు ఆభరణాలు వేసుకుని పుణ్యస్నానాలు ఆచరించారు. 15.5 కిలోల బరువున్న ఈ బంగారు ఆభరణాల విలువ సుమారు రూ. 3 కోట్ల వరకూ ఉండవచ్చని తెలుస్తోంది. సుధీర్ కుమార్ అనే ఈ సన్యాసి గతంలో ఢిల్లీలో వస్త్రవ్యాపారం చేసేవారట. కాగా ఈ విధంగా బంగారు ఆభరణాలు వేసుకోవడంపై ఆయన శిష్యులను అడగ్గా వ్యక్తిత్వాన్ని మెరుగు పరిచేందుకు బంగారం దోహదం చేస్తుందని చెప్పారు.

  • Loading...

More Telugu News