: ప్రభుత్వ ఏర్పాటుపై అంతిమ నిర్ణయం మహబూబాదే!


జమ్ము కాశ్మీర్ లో ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి నేడు జరిగే పీడీపీ సమావేశంలో పార్టీ అధినేత్రి మహబూబా ముఫ్తీ తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా పార్టీలో అంతర్గతంగా పలు దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ వ్యవహారం ఒక కొలిక్కిరాలేదు. ఈ నేపధ్యంలో ఈ రోజు జరిగే పార్టీ సమావేశంలో దీనిపై ఆమె ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ అనారోగ్యంతో కన్నుమూయడంతో ఆయన కుమార్తె మహబూబా ముఫ్తీ తదుపరి సీఎంగా ఎంపికయ్యే విషయమై ఇప్పటికే పీడీపీ, బీజేపీల మధ్య ఓ అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది. అలాగే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని బీజేపీ మహబూబాకు చెప్పినట్లు పార్టీ వర్గాల భోగట్టా.

  • Loading...

More Telugu News