: ఆర్ ఎస్ ఎస్ ముసలోళ్లు సగం ప్యాంట్లు వేసుకుంటారు: రబ్రీదేవి


బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి ఆర్.ఎస్.ఎస్ పై తాజాగా తీవ్ర విమర్శలు గుప్పించారు. భర్త లాలూ ప్రసాద్ యాదవ్ ను ఆర్జేడీ అధ్యక్షునిగా ఎంపిక చేసేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె ఆర్.ఎస్.ఎస్, అగ్రవర్ణాలపై నిప్పులు చెరిగారు. ఈ రోజుల్లో నేరాలు ఎవరు చేస్తున్నారు.. ఎవరు పట్టుబడుతున్నారు? అని ప్రశ్నించారు. అలాగే ఆర్.ఎస్.ఎస్ లో వయసుపైబడినవారు సైతం సగం ప్యాంట్లను ధరిస్తారు. ఇది వారికి సిగ్గుగా అనిపించదేమే అని వ్యాఖ్యానించారు. దీంతో సభలో ఉన్నవారు ఒక్కసారిగా నవ్వులు కురిపించారు. కాగా తమ ప్రభుత్వం నేరపూరితమైనదని ఆరోపిస్తున్నారు. ఇది సరికాదు. మీడియావారు మంచి విషయాలను సరిగా చూడరనుకుంటా.. తప్పుడు విషయాలనే పదేపదే చర్చిస్తుంటారు. ఆర్.ఎస్.ఎస్ నేతలు ఆందోళనలకు దిగినపుడు బిజెపి ఎందుకు మౌనం వహిస్తుంటుందని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News