: కొండెక్కిన విమాన ఛార్జీలు.. విశాఖ టు హైదరాబాద్ రూ. 17 వేలు
సంక్రాంతి పండుగకు ఊరెళ్లిన జనం తిరుగు ప్రయాణం కోసం విపరీతమైన కష్టాలు పడుతున్నారు. రైళ్లు, బస్సులు నిండిపోవడంతో ఇక విమానమే శరణ్యమని భావించారు. దీంతో విశాఖ నుండి హైదరాబాద్ కు సాధారణంగా రూ. 2 వేలకు దొరికే టిక్కెట్ అమాంతంగా రూ. 17 వేలకు చేరింది. తప్పనిసరి పరిస్థితుల్లో తిరుగుముఖం పట్టాల్సి రావడంతో విమాన చార్జీలు ఠారెత్తించినా ప్రయాణికులు లెక్కచేయలేదు. ఐదు వేలలోపు టికెట్ ఉండే ముంబయ్, చెన్నై, బెంగళూరు టిక్కెట్లకు కూడా అత్యధిక డిమాండ్ ఏర్పడింది. సాధారణంగా రూ.ఐదు వేల నుంచి పదివేల లోపు టికెట్ ఉండే ఢిల్లీ చార్జీ ఆదివారం ఏకంగా రూ.25 వేల నుంచి మొదలై రూ.70 వేలకు చేరుకుంది. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణికులు విమానమెక్కేందుకు వెనుకాడలేదు.