: ఇరాక్ లో అదృశ్యమైన భారతీయులు క్షేమం
గతేడాది ఇరాక్ లోని మోసుల్ పట్టణంలో కిడ్నాప్ కు గురైన భారతీయులు క్షేమమని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు. కిడ్నాప్ కు గురైన బాధితుల బంధువులు, కుటుంబ సభ్యులు ఢిల్లీలో ఆమెను కలిశారు. ఈ సందర్భంగా ఆమె వారితో మాట్లాడుతూ, గత ఏడాది జూన్ లో ఇరాక్ లోని మోసుల్ పట్టణంలో కిడ్నాప్ కు గురైన 39 మంది భారతీయులు క్షేమంగా ఉన్నట్టు విదేశాంగ వర్గాల నుంచి సమాచారం అందిందని అన్నారు. వారి విడుదలకు ప్రభుత్వం ప్రయత్నాలు ఆపలేదని, తమ ప్రయత్నాలు తాము చేస్తున్నామని ఆమె వారికి తెలిపారు. వీలైనంత త్వరలో వారు భారత్ కు వచ్చి కుటుంబాన్ని కలుస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.