: కేజ్రీవాల్ పై ఇంకు చల్లేందుకు ప్రయత్నించిన యువతి
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై ఇంకు చల్లేందుకు ఓ యువతి ప్రయత్నించింది. సరి-బేసి సంఖ్యల విధానం విజయవంతంగా అమలు కావడంతో ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో ఢిల్లీ ప్రభుత్వం 'ఢిల్లీకో బధాయి' అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనికి సుమారు 5000 మంది ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ వారినుద్దేశించి మాట్లాడుతుండగా, ఓ 20 ఏళ్ల యువతి కేజ్రీవాల్ పై ఇంకు, కొన్ని పేపర్లు, ఓ సీడీ విసిరింది. అయితే ఇంకు కేజ్రీవాల్ పై కాకుండా అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బందిపై పడింది. దీంతో భద్రతాధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.