: మాట నిలబెట్టుకోలేని వ్యక్తి ఆర్థికమంత్రా? : మాజీ సైనికుల ఆగ్రహం


ఓఆర్ఓపీ పై ఇచ్చినమాట తప్పారంటూ మాజీ సైనికులు మరోసారి ఆందోళన చేపట్టారు. ఈ నెల 3వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నివాసం ముందు ఓఆర్ఓపీ తక్షణం అమలు చేయాలంటూ ఆదోళన చేపట్టిన మాజీ సైనికులు, అప్పటి మాట నిలబెట్టుకోలేదంటూ నేడు మరోసారి ఢిల్లీలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 3వ తేదీన ఆందోళన చేపట్టినప్పుడు రక్షణ మంత్రితో మాట్లాడతానని అరుణ్ జైట్లీ హామీ ఇచ్చారని, దీంతో తాము అప్పటి ఆందోళన విరమించామని అన్నారు. ఇది జరిగి రెండు వారాలు పూర్తికావస్తున్నా రక్షణ మంత్రి నుంచి ఎలాంటి ప్రకటన రాలేదని వారు పేర్కొన్నారు. ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేని వ్యక్తి ఎలా ఆర్థిక మంత్రి అయ్యారని వారు విమర్శించారు. మాజీ సైనికులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టడంతో భద్రతాబలగాలను మోహరించారు. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News