: రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి...భావితరాలు మెచ్చేలా పని చేయాలి: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ లో చాలా సమస్యలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. నెల్లూరు జిల్లా కాంగ్రెస్ నేతలు ఆనం రామనారాయణ రెడ్డి, వివేకానందరెడ్డి అనుచరులు 2 వేల మందితో కలసి టీడీపీలో చేరిన సందర్భంగా విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, ఆనం సోదరులను, వారి అనుచరులను టీడీపీలోనికి మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నామని అన్నారు. భావి తరాలను దృష్టిలో పెట్టుకుని పని చేయాలని ఆయన వారికి సూచించారు. కష్టాలను సమర్థవంతంగా ఎదుర్కొంటే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఆయన చెప్పారు. కష్ట సమయంలో కూడా రైతు రుణమాఫీ అమలు చేశామన్న విషయాన్ని అంతా గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు.