: కోహ్లీ సెంచరీ... కనిపిస్తున్న మరో భారీ స్కోరు!
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడవ వన్డే పోరులో కోహ్లీ సెంచరీ సాధించాడు. మొత్తం 105 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 6 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో సెంచరీ చేశాడు. ఇది కోహ్లీకి వన్డేల్లో 24వ సెంచరీ. అంతకుముందు భారీ షాట్ ను అటెంప్ట్ చేయబోయిన శిఖర్ ధవన్ తన వికెట్ ను సమర్పించుకున్నాడు. 91 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 68 పరుగులు చేసిన ధవన్ హాస్టింగ్స్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం కోహ్లీకి మద్దతుగా అజిక్య రహానే 45 (49 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) పరుగులతో క్రీజులో ఉన్నాడు. భారత స్కోరు 43 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 230 పరుగులు కాగా, ఆటగాళ్లు భారీ షాట్లతో రాణిస్తే, మరోసారి 300 పరుగులకు పైగా స్కోరును సాధించే అవకాశాలున్నాయి.