: ముంబై నడిబొడ్డున తొలిసారిగా వెలుగులోకి వచ్చిన పురాతన బౌద్ధ గుహలు
దేశ ఆర్థిక రాజధాని నగరంగా గుర్తింపు పొందిన ముంబైలోని బోరివిలి ప్రాంతంలో ఉన్న సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ లో ఏడు పురాతన గుహలు తొలిసారిగా వెలుగులోకి వచ్చాయి. ఇవి బౌద్ధుల 'విహారాలు' అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఓ హార్మిక (బౌద్ధ స్థూపం పై భాగం)తో పాటు ఏడు గుహలు ఇక్కడ వెలుగులోకి వచ్చాయి. ఇవి రుతుపవనాల సమయంలో బౌద్ధ గురువుల ఆవాసాలని నమ్ముతున్నట్టు విల్లీపార్లేలోని ముంబై యూనివర్శిటీ ఆర్కియాలజీ విభాగం అధికారులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం ఏఎస్ఐ (ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా) అధికారుల సాయం కోరినట్టు పరిశోధనలు సాగిస్తున్న టీం హెడ్ సూరజ్ పండిట్ తెలిపారు. ఇవి క్రీస్తుపూర్వం 1వ శతాబ్దానికి చెందినవని వివరించారు. ఇంతకాలం ఇవి వెలుగులోకి రాకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. క్రీస్తుశకం పదవ శతాబ్దం వరకూ ఇక్కడ బౌద్ధులు నివాసమున్నట్టు భావిస్తున్నామని వివరించారు.