: ఈ రోజు దాఖలు చేసిన నామినేషన్ పత్రాల సంఖ్య 1003


గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ప్రక్రియ జోరందుకుంది. నేడు ముహూర్త బలం ఉండడంతో భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి రోజు కేవలం 94 నామినేషన్ పత్రాలు దాఖలు కాగా, నేడు 1003 నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయని అధికారులు వెల్లడించారు. ఇక రేపు (ఆదివారం) చివరి రోజు కావడంతో నేడు చాలా మంది నామినేషన్ పత్రాలు వేశారని వారు వివరించారు. నామినేషన్లు దాఖలు చేసేవారి కోలాహలంతో జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయం వద్ద సందడి నెలకొంది. నేడు టీఆర్ఎస్ 277, బీజేపీ 93, టీడీపీ 187, కాంగ్రెస్ 200, స్వతంత్రులు 249 మంది నామినేషన్లు దాఖలు చేశారని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News