: దేవుడే దిగివచ్చినా జల్లికట్టు ఆగదన్న రంగంపేట యూత్...ఇంత ఆనందం ఎప్పుడూ లేదన్న బాలయ్య


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంత మండలం చంద్రగిరిలోని రంగంపేట, పుల్లయ్యగారిపల్లెలో కొద్దిసేపటి క్రితం జల్లికట్టు ప్రారంభమైంది. టాలీవుడ్ అగ్ర నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ ఉత్సవాలను ప్రారంభించారని రంగంపేట యువకుడొకరు చెప్పాడు. ఈ సందర్భంగా ఆ యువకుడు ఓ తెలుగు టీవీ చానెల్ తో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా కనుమ నాడు నిర్వహిస్తున్న జల్లికట్టు ఏళ్ల తరబడి కొనసాగుతూ వస్తున్న అనవాయతీ అని అతడు పేర్కొన్నారు. ఈ క్రీడను కేంద్ర ప్రభుత్వం కాదు కదా సుప్రీంకోర్టు కూడా ఆపజాలదని అతడు కుండబద్దలు కొట్టాడు. సాక్షాత్తు దేవుడే దిగివచ్చినా ఈ జల్లికట్టు ఆగదని అతడు చెప్పాడు. ఇక వేడుకను ప్రారంభించిన బాలయ్య జల్లికట్టును ఆసక్తిగా తిలకిస్తున్నారని అతడు పేర్కొన్నాడు. అంతేకాక జల్లికట్టు సందర్భంగా తాను పొందిన ఆనందం మరెప్పుడూ పొందలేదని కూడా బాలయ్య పేర్కొన్నారని ఆ యువకుడు చెప్పాడు.

  • Loading...

More Telugu News