: గ్రేటర్ బరిలో కేకే కూతురు... బంజారాహిల్స్ నుంచి నామినేషన్ వేసిన విజయలక్ష్మి


టీఆర్ఎస్ సీనియర్ నేత కె.కేశవరావు (కేకే) కూతురు విజయలక్ష్మి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల బరిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఆమె పోటీ చేస్తున్నారు. నగరంలోని సంపన్నుల ప్రాంతంగా పేరుగాంచిన బంజారాహిల్స్ డివిజన్ నుంచి విజయలక్ష్మి పోటీ చేస్తున్నారు. ఈ మేరకు పార్టీ నుంచి టికెట్ దక్కించుకున్న ఆమె కొద్దిసేపటి క్రితం తన నామినేషన్ ను దాఖలు చేశారు. రేపటితో నామినేషన్ల గడువు ముగియనున్న నేపథ్యంలో నేడు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు కానున్నట్లు సమాచారం. అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులు నేడు నామినేషన్లు వేయనుండటంతో ఆయా కార్యాలయాల పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది.

  • Loading...

More Telugu News