: 400 సంవత్సరాల తరువాత దళితులు, మహిళలకు ఆలయ ప్రవేశం


అది డెహ్రాడూన్ లోని 400 ఏళ్ల చరిత్రగల ఆలయం. దళితులు, మహిళలను ఆచారం పేరుతో ఆలయంలోనికి రానివ్వరు. అదే జాన్సర్ బవర్ ప్రాతంలో నెలకొన్న పరశురామ ఆలయం. తాజాగా ఈ ఆలయానికి ఒక కమిటీ ఏర్పాటు కావడంతో నూతన మార్పులు సంతరించుకున్నాయి. దాంతో ఆలయంలోకి అందరికీ ప్రవేశం కల్పిస్తూ కమిటీ నిర్ణయం తీనుకుంది. కాగా ఈ ప్రాంతానికి చెందిన దళిత నాయకులు ఎంతో కాలంగా ఆలయంలో ప్రవేశం కోసం పోరాటాలు చేస్తూవస్తున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఇటీవలి కాలంలో ఎన్నో మార్పులు సంతరించుకున్నాయని, స్థానిక ప్రజలు కూడా విద్యావంతులయ్యారని అన్నారు. ఆచారాల పేరుతో ఇకమీదట ఇలాంటివి సాగనివ్వకుండా చూస్తామన్నారు.

  • Loading...

More Telugu News