: పశ్చిమాఫ్రికాపై ‘ఉగ్ర’దాడి... తమ పనేనని ఆల్ కాయిదా ప్రకటన


ఉగ్రవాదులు ప్రపంచవ్యాప్తంగా దాడులకు బరి తెగిస్తున్నారు. ఇప్పటికే ఐఎస్ ఉగ్రవాదుల దాడులతో ఫ్రాన్స్, అమెరికా, ఆఫ్ఘాన్ తదితర దేశాలన్ని వణికిపోయాయి. తాజాగా పశ్చిమాఫ్రికా దేశం భుర్కినాఫాసోపై నిన్న ఆల్ కాయిదా ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఆ దేశ రాజధాని వాగడూపై మెరుపు దాడికి దిగిన ఆల్ కాయిదా ఇన్ ద ఇస్లామిక్ మాగ్రెబ్ (ఏక్యూఐఎం) ఉగ్రవాదులు నగరంలోని స్ల్పెండిడ్ హోటల్ లోకి చొచ్చుకువెళ్లారు. హోటల్ వెలుపల రెండు కారు బాంబులను పేల్చేసిన ఉగ్రవాదులు 20 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఆ తర్వాత హోటల్ లోకి వెళ్లి అక్కడనున్న వారిని బందీలుగా చేసుకున్నారు. సమాచారం అందుకున్న సైన్యం హుటాహుటిన అక్కడికి చేరుకుంది. తమను నిలువరించేందుకు రంగంలోకి దిగిన సైన్యంతో ఉగ్రవాదులు భీకర పోరు సాగిస్తున్నారు. కాల్పుల శబ్దాలతో వాగడూ నగరం దద్దరిల్లిపోయింది. ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు దేశంలోని ఫ్రాన్స్ బలగాల సహాయం తీసుకునేందుకు భుర్కినాఫాసో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పర్యాటక ప్రాంతమైన భుర్కినాఫాసోలో విదేశీ పర్యాటకుల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. ప్రస్తుతం ఉగ్రవాదులు బందీలుగా పట్టుకున్న వారిలోనూ పలువురు విదేశీయులున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News