: బీజేపీతోనే తెలంగాణ వస్తుంది: నాగం జనార్ధన్ రెడ్డి
భారతీయ జనతా పార్టీతోనే తెలంగాణ ఏర్పాటు సాధ్యమని నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి కొత్త రాగం అందుకున్నారు. తెలంగాణ రావాలంటే ఎన్డీఏ అధికారంలోకి రావాలని చెప్పారు. అయితే, తాను ఏ పార్టీలో చేరేది అనే దానికి ఇంకా సమయం పడుతుందన్న నాగం, కార్యకర్తలతో చర్చించి నిర్ణయం వెల్లడిస్తానని చెప్పారు. ఈ మధ్యాహ్నాం ఢిల్లీలో బీజేపీ జాతీయ నేత రాజ్ నాథ్ సింగ్ తో నాగం భేటీ అయ్యారు. అనంతరం మీడియా తో మాట్లాడిన ఆయన పైవిధంగా స్పందించారు. అంతకుముందు నాగం బీజేపీలో చేరుతున్నట్లు పలు ఊహాగానాలు వచ్చాయి.