: స్వల్పంగా తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు


పెట్రలు, డీజిల్ ధరలను స్వల్పంగా తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర మరింతగా పతనమై 29.73 డాలర్లకు చేరింది. వెస్ట్ టెక్సాస్ ముడిచమురు ధర 30.36 డాలర్లకు చేరింది. గత పుష్కర కాలంలో క్రూడాయిల్ ధర ఈ స్థాయికి దిగజారడం ఇదే తొలిసారి. ఒపెక్ సమావేశంలో ముడిచమురు ఉత్పత్తిని తగ్గిస్తూ నిర్ణయం తీసుకునే అవకాశాలు లేకపోవడంతోనే ధరలు మరింతగా తగ్గుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ లో ముడిచమురు బ్యారెల్ ధర 30 డాలర్ల దిగువకు చేరింది. దీంతో ప్రతి రెండు వారాలకూ ఒకసారి పెట్రోలు, డీజెల్ ధరలను సవరిస్తున్న ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పెట్రోలు ధరను 3 రూపాయలు, డీజిల్ ధరను 2.5 రూపాయలు తగ్గించే అవకాశం ఉందని వార్తలు వెలువడ్డాయి. వీటికి భిన్నంగా పెట్రోలియం కంపెనీలు పెట్రోలుపై 32 పైసలు, డీజిల్ పై 85 పైసలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.

  • Loading...

More Telugu News