: కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రముఖ గాయకుడు మహ్మద్ రఫీ కుమారుడు


ప్రముఖ గాయకుడు మహ్మద్ రఫీ కుమారుడు షాహిద్ మొహ్మద్ రఫీ (52) కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరారు. ముంబైలోని ముస్లింలు అధికంగా గల ముంబాదేవీ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ నుంచి ముంబై అసెంబ్లీకి పోటీ చేసిన ఆయన పరాజయం పాలయ్యారు. తన తండ్రి గాయకుడిగా పేరు తెచ్చుకుని ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టేవారని, ఆయన లాగే తాను కూడా సేవాకార్యక్రమాల్లో పాలుపంచుకుంటుంటానని, ప్రజలకు మరింత చేరువైనప్పుడే సేవను కొనసాగించగలమని, అందుకే ప్రజాప్రతినిధిగా మారానని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News