: బంగాళాదుంప మొక్కకు టమోటాలు!
బంగాళాదుంప మొక్కకు టమోటాలు రావడమేంటని ఆశ్చర్యంగా ఉందా? అయితే, ఇది చదవాల్సిందే. సాధారణంగా టమోటా మొక్కలకు టమోటాలు, బంగాళదుంప మొక్కలకు బంగాళదుంపలు వస్తాయన్న విషయం తెలిసిందే. శాస్త్రేవేత్తలు ఏవైనా పరిశోధనలు చేసి పండించినా, దుంపరకం జాతికి పలురకాల దుంపలు, పండు రకం జాతి మొక్కలకు పలురకాల పండ్లు కాసేలా చేస్తారు. దీనికి భిన్నంగా ఎలాంటి పరిశోధనలు జరపకుండా హర్యానాలోని లుడానా గ్రామానికి చెందిన ఓ రైతు భూమిలో వేసిన బంగాళదుంప చేలో మొక్కలకు టమోటాలు కాశాయి. బంగాళదుంప మొక్కలకు కొత్తగా పూలు రావడంతో పంట పోయిందేమో అని రైతు భావించాడు. వాటిని అలాగే వదిలేయగా కొన్నాళ్టికి వాటి నుంచి టమోటాలు వచ్చాయి. దీంతో బంగాళా దుంప మొక్కకి టమోటాలు కాశాయని భావించిన రైతు, ఆ మొక్కలు పీకేద్దామని భావించి, ఒక మొక్కను పీకాడు. ఆ మొక్క వేర్లలో బంగాళదుంపలు ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. దీంతో బంగాళదుంపలు, టమోలు ఒకే మొక్కకు కాశాయని ఆ రైతు సహచర రైతులకు చెప్పడంతో, ఆ గ్రామంలోని ఆ పంటపొలం సెలబ్రిటీగా మారింది. రైతులంతా ఈ అద్భుతం చూసేందుకు ఆ పొలానికి క్యూకడుతున్నారు.