: పతంగుల పండుగలో మోహన్ బాబు, సుమన్


హైదరాబాదులోని ఆగాఖాన్ అకాడమీలో కైట్ ఫెస్టివల్ ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకలో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు ప్రముఖులు ఆసక్తి చూపారు. వివిధ రకాల పతంగులు ఎగురవేసేందుకు ఔత్సాహికులు ఉత్సాహం చూపారు. టాలీవుడ్ ప్రముఖ నటుడు సుమన్ టూరిజం కృషిని కొనియాడారు. అయితే జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఇళ్లపైకి, టెర్రస్ లపైకి ఎక్కి కాకుండా, కేవలం నేలపై నుంచి మాత్రమే గాలిపటాలు ఎగురవేయాలని ఆయన సూచించారు. కాగా,మరో నటుడు మోహన్ బాబు కుటుంబంతో పాటు వచ్చి కైట్ ఫెస్టివల్ లో పాల్గొన్నారు. తన ఇద్దరు కుమార్తెలతో కలసి గాలిపటాలు ఎగురవేయించడంలో నటుడు మంచు విష్ణు బిజీబిజీగా గడిపాడు. వేడుకలు చాలా బాగా జరుగుతున్నాయని వారు వివరించారు.

  • Loading...

More Telugu News