: సునంద పుష్కర్ మృతికి విష ప్రయోగమే కారణం?... పోలీసుల చేతికి ఫైనల్ రిపోర్ట్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్ర శశి థరూర్ భార్య సునంద పుష్కర్ అనుమానాస్పద మృతిపై మిస్టరీ వీడనుంది. విష ప్రయోగం కారణంగానే ఆమె చనిపోయారన్న ఆరోపణలు వాస్తవమేనని తేలిపోయినట్లు సమాచారం. ఈ మేరకు అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) వైద్యుల తుది నివేదిక నేటి ఉదయం ఢిల్లీ పోలీసులకు చేరింది. సునంద పుష్కర్ మృతికి సంబంధించి వైద్య పరీక్షల తుది నివేదిక తమకు అందిందని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బస్సీ నేటి ఉదయం ప్రకటించారు. నివేదికలో ఏముందనే విషయంపై మాత్రం ఆయన నోరు విప్పలేదు. అయితే విష ప్రయోగం కారణంగానే ఆమె చనిపోయిందన్న కథనాలు జాతీయ మీడియాలో ప్రసారమవుతున్నాయి.