: ఆపరేషన్ బర్డ్ స్కై... పతంగుల నుండి పక్షుల పరిరక్షణకు


ప్రస్తుతం ఈ ఆపరేషన్ జైపూర్ లో ముమ్మరంగా కొనసాగుతోంది. పంతంగుల కారణంగా గాయాలపాలైన పక్షులను కాపాడేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. జైపూర్ కు చెందిన 45 సంవత్సరాల దీపక్ శర్మ జంతు ప్రేమికుడు. తనలాగే జంతువులను, పక్షులను ప్రేమించే వారితో ఒక టీంను ఏర్పాటు చేసుకుని వీధుల్లో తిరుగుతూ పతంగుల బారిన పడి గాయాలపాలైన పక్షులను కాపాడుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక హెల్ప్ లైన్ ను ఏర్పాటుచేసి బాధిత పక్షులను ఆదుకుంటున్నారు. గాలి పటాలను ఎగురవేయడం ఎవరికైనా ఇష్టమే... కానీ ఇందుకు వినియోగించే దారం తోనే ప్రమాదాలు సంభవిస్తున్నాయి. తెల్లవారుజామున, సాయంత్రం వేళల్లో పక్షులు అంతగా ఆకాశంలో తిరగవని, ఈ సందర్భాలను చూసుకుని పతంగులను ఎగురవేయాలని దీపక్ శర్మ సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News