: కేంద్రం నుంచి తెలంగాణకు 791 కోట్ల రూపాయల కరవు సాయం


తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం భారీ కరవు సాయం ప్రకటించింది. కరవుతో అల్లాడుతున్న రైతాంగానికి సాయంగా 791 కోట్ల రూపాయల సాయం అందజేస్తున్నట్టు కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్ తెలిపారు. తెలంగాణకు కరవు సాయంపై ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి కమిటీ నిర్ణయం ఆధారంగా ఈ మొత్తం అందజేసినట్టు ఆయన చెప్పారు. ఈ సాయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అందజేసిన సాయం కంటే ఎక్కువని ఆయన పేర్కొన్నారు. ఇంత పెద్ద సాయం గతంలో ఎప్పుడూ ఏపీకి అందజేయలేదని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News